ప్రస్తుతం చైనా  అంశం  ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారుతున్న విషయం తెల్సిందే. కరోనా  వైరస్ రూపంలో గాని.. చైనా  వ్యవహరిస్తున్న తీరు లో కానీ ప్రస్తుతం చైనా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. దాదాపుగా చైనాపై ప్రపంచ దేశాలు ఎంతో గుర్రు గానే ఉన్నాయి . అయితే చైనా ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అంటే... కనిపించిందా భూభాగాలన్నీ.. ఒకప్పుడు మా దేశంలోనే భూభాగాలే  అంటూ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే భారతదేశంలోని పలు విభాగాలను తమ దేశానికి చెందినవి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఘర్షణకు దిగడం లాంటివి చేస్తుంది. 

 


 ఇక ఇప్పుడు చైనా దృష్టి మొత్తం జపాన్ పై పడినట్లు తెలుస్తోంది, జపాన్ కు సంబంధించిన పలు భూభాగాలను కూడా తమకు సంబంధించినవే అంటూ  ప్రస్తుతం చైనా ఒక వాదన తెరమీదికి తెచ్చింది. అయితే మామూలుగా జపాన్ ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోకుండా ఎంతో నిజాయితీగా పాలన సాగిస్తూ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ దేశ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏ దేశంతో కూడా వివాదాలను పెట్టుకోవడం లేదు జపాన్. కానీ తాజాగా చైనాకు  మాత్రం వార్నింగ్ ఇచ్చింది జపాన్. 

 


 చైనా 1972నుంచి తమ  దేశానికి చెందింది అని చెప్పుకుంటున్న జపాన్ తీరంలో ఉన్న శంఖకుష్  దీవులకు  సంబంధించి...జపాన్ చైనా కు  వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగాల  జోలికి వస్తే ఊరుకోబోమని తెలిపింది.  ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జపాన్ పరిపాలనలో ఉంది. ఆ ప్రాంతాలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తోంది జపాన్ . అయితే ఇలాంటి నేపథ్యంలో తమ భూభాగం  అని చెబుతున్న చైనా ప్రస్తుతం అక్కడి దీవులను కొంచెం కూడా కదిలించే ప్రసక్తి లేదని ఒకవేళ కదిలిస్తే జపాన్ తో పాటు  యూరోపియన్ యూనియన్ అమెరికా చైనాతో యుద్ధం చేయడానికి జపాన్ కు సహకరించి చైనాను మట్టుబెట్టడం  ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: