ప్రేమ అంటే వర్ణించడానికి పదాలు సరిపోవు... మాటల్లో వర్ణించలేని మధురానుభూతి ప్రేమ... కానీ ఈ రోజుల్లో ప్రేమ అంటే నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది... దారుణాలకు అడ్డాగా  మారిపోయింది. కొంతమంది ప్రేమ ముసుగు వేసుకుని శారీరకంగా వాడుకుని ఆ తర్వాత మహిళలను రోడ్డున పడేస్తూ ఉంటే... మరి కొంతమంది ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారి  ఏకంగా ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి  ఘటనలు రోజురోజుకు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటన కూడా సంచలనం రేపుతోంది. ఆ యువకున్ని  ప్రేమించడమే ఆమెకు శాపంగా మారిపోయింది.


 గత కొంతకాలం నుండి యువతి ప్రియున్ని దూరం పెట్టడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు ఏకంగా ప్రియురాలి ప్రాణాలను తీసేసాడు. ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది, కోయంబత్తూరు నగరం పరిధిలోని పేరూరు ఈ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది... ఈ క్రమంలోనే సదరు యువతికి రితీష్  అనే  యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరి జంట తరచూ కలుసుకుంటూ ఉండేవారు. లాక్ డౌన్  కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో వీరిద్దరి మధ్య ఎంతోదూరం పెరిగి పోవడంతో తీవ్ర మనోవేదన చెందాడు రితీష్.



 సాహసం చేసి ప్రియురాలు ని కలవడానికి వెళ్లి కుటుంబ సభ్యులకు దొరికిపోయాడు. దీంతో రితీష్ ను మందలించిన  యువతి కుటుంబ సభ్యులు యువతికి కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి ఐశ్వర్య రితీష్ ను  దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య తీరుపై తీవ్ర కోపోద్రిక్తుడైన రితీష్ ఉన్మాదిగా  మారిపోయాడు. ఇటీవలే రాత్రి సమయంలో ఐశ్వర్య ఇంటికి వెళ్లి నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటూ ప్రశ్నించారు.



తీవ్ర భయాందోళనకు గురైన యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు.. ప్రేమించడం లేదు అంటూ ఐశ్వర్య చెప్పగానే.. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా  ఐశ్వర్య పై దాడి చేశాడు. ఈ క్రమంలోనే అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రి పై  కూడా దాడి చేయగా తీవ్ర గాయాల పాలయ్యాడు ఆ యువతి తండ్రి. ఇక పెద్ద పెద్ద కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చేసరికి రితీష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది . ప్రస్తుతం ఐశ్వర్య తండ్రి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై  కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: