కరోనా మహమ్మారి అయ్యి  ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ కరోనా వైరస్ తీవ్రంగా విస్తరించడంతో తిరుపతిలో మళ్లీ లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ పట్టించుకోకుండా  సోమవారం రాత్రి ఏడు గంటలకి ఒక యువకుడు తన బైక్ పై రోడ్డు మీదికి వచ్చాడు. తనని చూసిన పోలీసులు ఆపారు. కానీ ఆ యువకుడు ఆగలేదు. మరో సెంటర్ వద్ద బైక్ ఆపకుండా వెళ్తున్న తనని కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడు.

 

అయితే సోమవారం రాత్రి బైక్ పై వచ్చిన యువకుడిని పోలీసులు ఆపినా ఆగకపోయే సరికి కానిస్టేబుల్ లాఠీ తో కొట్టాడు. దీంతో అతని నోటి పై కొట్టడంతో రెండు పళ్ళు ఊడిపోయాయి. వివరాల్లోకి వెళితే తిరుపతి ఎస్టీవీ నగర్ కు చెందిన  జయచంద్ర ప్రసాద్ (19). తన బైక్ పై అన్నమయ్య సర్కిల్ వైపు వెళ్తున్నాడు. అయితే సర్కిల్ వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు అతడు బైక్ ఆపడానికి ప్రయత్నించారు. కానీ జయచంద్ర ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాడు కానీ మరి కొంత దూరంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్ వద్ద ఉన్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఆగమని హెచ్చరించాడు.

 

దీనితో జయచంద్రకి భయం వేసి ఆగలేదు. ఇక ఆగ్రహంతో కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న లాఠీ తో గట్టిగా కొట్టగా పొరపాటున నోటికి తగిలింది. దీనితో జయచంద్ర రెండు పళ్ళు ఊడిపోయి రక్తం కారింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ బీవీ శివప్రసాద్ రెడ్డి తక్షణమే అక్కడికి చేరుకున్నాడు. బాధితుడిని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

 

వెంటనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు అక్కడికి  చేరుకుని ఆందోళన చేసారు. బైక్ ఆపకపోతే కొడతారా అని నిలదీసారు. కానిస్టేబుల్ క్షమాపణ చెప్పాలని ఆందోళన చేశారు. సీఐ స్టేషన్ కి పిలిపించి సర్ది చెప్పారు. బాధితుడి చికిత్స అనంతరం ఇంటికి తీసుకుని వెళ్లారు పోలీసులు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: