తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. భారీగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కరోనా  వైరస్ కారణంగా మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతుంది. ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జరుగుతున్న కొన్ని కొన్ని హృదయ విదారక ఘటన లు  చూస్తుంటే... మనసు చలించిపోతుంది. ప్రతి మనిషికి ఎంతో దయనీయ  పరిస్థితులను తీసుకొచ్చింది ఈ కరోనా వైరస్. కరోనా వైరస్ భయంతో ఇతర రోగాలతో ఆసుపత్రికి వెళ్లిన.. వైద్యం చేసేందుకు వైద్యులు భయపడుతున్నారు. వెరసి రోజురోజుకు ఇలా వైద్యం అందక ప్రాణాలు పోతున్న మరణాల  సంఖ్య ఎక్కువ అయిపోతుంది. కళ్లముందే తమ కుటుంబీకుల ప్రాణాలు పోతుంటే ఏమీ చేయలేని చేతగాని స్థితిలో ఉన్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.


ఇలా రోజురోజుకు కరోనా సోకకుండా నే మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. గత వారం క్రితం శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో... తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లింది  భార్య. ఇది కరోనా  లక్షణమే అంటూ అక్కడి డాక్టర్లు వైద్యం చేసేందుకు నిరాకరించారు. కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడిన కనికరించలేదు. చివరికి చేసేదేమీ లేక సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు ఆ వ్యక్తి. విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లో చోటుచేసుకుంది. మండలంలోని అబ్బెన్ద  గ్రామానికి చెందిన బాబురావు టీవీ మెకానిక్ గా పని చేస్తున్నాడు.


వారం రోజుల క్రితం శ్వాస సమస్య రావడంతో నారాయణ్ ఖేడ్  లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సమస్య మరింత తీవ్రం కావడంతో... మంగళవారం ఉదయాన్నే సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆస్పత్రి సిబ్బంది మాత్రం దయ  చూపలేదు... వైద్యం అందించేందుకు నిరాకరించారు.. బాబురావు భార్య చంద్రకళ వైద్యుల కాళ్ళ మీద పడింది... మీకు దండం పెడతాను సార్.. వైద్యం చేసి నా  భర్త ప్రాణాలు కాపాడండి.. ప్రాణాలు పోయేలా ఉన్నాయి సార్.. అంటూ ఎంతో దీనంగా ప్రాధేయపడింది. అయినప్పటికీ వైద్యుల మనసు కరగలేదు. ఇక చేసేదేమీ లేక సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా..  మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు బాబురావు.ఇదే అదునుగా భావించిన  డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి రెట్టింపు డబ్బులు అడిగాడు అంటూ చంద్రకళ వాపోయింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: