ఆనం రామనారాయణ రెడ్డి... ఆత్మకూరు నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీ పవర్ కు నిర్వచనం ఈ పేర్లు. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం ఆత్మకూరులో ఆనంరామ నారాయణ రెడ్డి మ్యావ్ అని అంటున్నాడు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆనం రామానారాయణ రెడ్డి పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పుడు ఫ్యాన్ గాలి వీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక్కడ ఈజీగా గెలిచేస్తాడని స్థానిక విశ్లేషకులు అంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి దాదాపు పది సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాడు. వైఎస్సార్ క్యాబినెట్ లో, రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లో కూడా ఆనం మంత్రిగా ఉన్నాడు. కిరణ్ ఆస్థానంలో ఆర్థిక శాఖ మంత్రి గా పనిచేశాడు ఆనం రామనారాయ రెడ్డి. ఆ సమయంలో ఆయన కోట్ల రూపాయలు తెచ్చి మరీ నియోజకవర్గంలో వెచ్చించాడట. ఆనం సొంత నియోజకవర్గంపై పెట్టిన ఖర్చును చూసి ఇతర నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారప్పట్లో. అయితే ఇప్పుడు అంత జేసినా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థికి మిగిలింది శూన్యమే అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారం సమయంలో కాంగ్రెస్ లోనే ఉండటం, అధిష్టానానికి దాసుడిలా వ్యవహరించడం ఆనంపై వ్యతిరేకతకు కారణం అవుతోందని తెలుస్తోంది. నియోజకవర్గంపై ఎంత ఖర్చుపెట్టినా , ఎంత అభివృద్ధి చేసినా ఇప్పుడు ఆనంను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఈ నియోకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా బాగా వీకయ్యింది. ఇక్కడ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు కొంతకాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. దీంతో ఆయన వర్గం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తోంది. ఫలితంగా ఇక్కడ వైకాపా విజయం ఈజీనేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. >

మరింత సమాచారం తెలుసుకోండి: