జగన్ కానీ రెండు రోజుల్లో స్పందించకుంటే తాను మళ్లీ మీడియా ముందుకు వస్తానని చెప్పారు. చంద్రబాబు విధించిన 48 గంటల డెడ్ లైన్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీంతో చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జగన్ సర్కార్ పై చంద్రబాబు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పవిత్ర నదుల నుంచి నీళ్లను తీసుకొని వచ్చే అమరావతికి శంఖుస్థాపన చేశారని చెప్పారు. మోదీ ఆ సమయంలో అమరావతికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. జగన్, వైసీపీ నేతలు అధికారంలోకి రాక ముందు రాజధాని విషయంలో ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు. జగన్, వైసీపీ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని చంద్రబాబు విమర్శలు చేశారు.
ప్రజలను మోసం చేయడం నీచమైన చర్య అని అన్నారు. తాను చేస్తున్న పోరాటం పార్టీ కోసమో.... కుటుంబం కోసమో కాదని రాష్ట్ర ప్రజల్లో చైతన్యం, తిరుగుబాటు రావాలని అన్నారు. అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తించే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మరోవైపు హైకోర్టులో మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించి అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కోరడంతో పిటిషన్ ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి