ప్రపంచమంతా కరోనా కష్ట కాలంతో పోరాడుతుంది అంటే దానికి ప్రధాన కారణం చైనా అని ఇప్పటికే చాలా పత్రికలు వెల్లడించాయి.... ఇది జగమెరిగిన సత్యం. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే... తన మాటల తూటాలతో చైనా పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కరోనాను చైనా వైరస్ అని... అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసే అమానుష దేశం అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా చైనాపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతటితో ఆగక ప్రపంచదేశాలను చైనా పై యుద్ధానికి సిద్ధం కావాలి అంటూ పిలుపునిస్తున్నారు. ఇటీవల భారతదేశంలో టిక్ టాక్ తో సహా మరికొన్ని యాప్ లను నిషేధించింది ఇండియా ప్రభుత్వం.
ఇప్పుడు ఈ ఐడియా... అసలే చైనా పై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ కు పెద్ద అస్త్రంగా మారింది. భారత్ బాటలోనే నడిచారు డొనాల్డ్ ట్రంప్, తన దేశంలో కూడా మోస్ట్ పాపులర్ అయిన యాప్ లలో టిక్ టాక్ 1 ఇప్పుడు దాన్ని నిషేధిస్తూ ఆర్డర్ పై సంతకాలు చేశాడు. ఈ మధ్యన నిరంతరం డొనాల్డ్ ట్రంప్ ఏదోఒక వార్తలతో మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు.
అయితే ఈ చర్యల పై డ్రాగన్ దేశం మండిపడుతోంది నేనే మోనార్క్ అని అనుకొనే సహజ గుణం ఉన్న ట్రంప్ కు కచ్చితంగా త్వరలోనే గుణ పాఠాలు నేర్పుతాము అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అమెరికాలో టిక్ టాక్ రద్దు అన్న ప్రకటన విన్న రాజకీయ వర్గాలు ఇక అమెరికా చైనాల మధ్య మరో అగాధానికి ఈ టిక్ టాక్ బాన్ కారణం కానుందని తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు... ఎప్పుడు సోషల్ మీడియాలో విమర్శలతో వైరల్ అయ్యే ట్రంప్ కు ఇలాంటి బెదిరింపులు కొత్త కాకపోయినా చైనా వ్యాఖ్యల కు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి