ఇలాంటి దొంగ బాబాల గుట్టు రట్టు చేసిన పోలీసులు శిక్ష లు విధించినప్పటికీ ఎవరి లో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఇలా మంత్రాల పేరుతో మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా రెండేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్న బురిడీ బాబాను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని రెయిన్ బజార్ లో నివాసముండే అర్షద్ మంత్రాలతో అనారోగ్యాలను నయం చేస్తా అంటూ ప్రచారం చేసుకునే వాడు. ఎంతోమంది అమాయకమైన ప్రజలు అది నిజమే అని నమ్మి అతని సంప్రదించేవారు. ఈ క్రమంలోనే 2018 సంవత్సరంలో ఓ మహిళా ఆరోగ్య సమస్యలతో సదరు బురిడీ బాబా వద్దకు వెళ్లగా పూజల పేరుతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
తన కామ కోరికలు తీరిస్తే ఆరోగ్య సమస్యలు నయమవుతాయని మాయమాటలు చెప్పి అనేకసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఇక కొన్ని రోజుల్లోనే తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బురిడీ బాబా గురించి ఆరా తీయగా అతని కామలీలలు మొత్తం బయట పడ్డాయి. విషయం తెలుసుకున్న సదరు బురిడీ బాబా పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, ఇటీవలే ఆదివారం సాయంత్రం సమయంలో రాజేంద్రనగర్ పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల వెనుకకు తోసారూ. నిందితుడి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు విచారణ జరుపుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి