నయా భారత్ పేరుతో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించబోతున్నారని, తెలంగాణలో సీఎం కుర్చీ కేటీఆర్ కు అప్పగించబోతున్నారని, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం పూర్తికాగానే కెసిఆర్ పూర్తిగా ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెడతారని మీడియాలో ఒకటే హడావుడి నడిచింది. దీనిపైన అనేక ఊహాగానాలు, విశ్లేషణలు, డిబేట్ లు పెద్ద ఎత్తున మీడియాలో చర్చకు వచ్చాయి. కెసిఆర్ ఇంత ఆకస్మాత్తుగా జాతీయ పార్టీ స్థాపించడానికి కారణం జమిలి ఎన్నికలు అని, మోదీ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా, దానిని సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్నారని, ఇలా ఎన్నో రకాల కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ విషయమై టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొనడంతో, దీనిపై స్పందించిన కేసీఆర్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. తాను జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు పత్రికల్లో వస్తున్న వార్తలను చూసి ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దని, అసలు వాటిపై ఎవరూ స్పందించ వద్దని సూచించారు. అసలు తనకు పార్టీ పెట్టే ఆలోచన ఉంటే, అందరికీ చెప్పే చేస్తానని, మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదే అని క్లారిటీ ఇచ్చారు. నయా భారత్ గియా భారత్ ఏదీ లేదని, సూటిగా చెప్పేశారు. అసలు పార్టీ శ్రేణులు ఎవరు ఈ అంశంపై ఎక్కడా మాట్లాడవద్దని గట్టిగానే స్పష్టం చేసి, ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టారు.
అయితే ఈ వార్తల్లో నిజం లేకపోలేదని, పార్టీ పెడుతున్నారని లీకులు కేసీఆర్ స్వయంగా ఇచ్చి, ప్రజా స్పందన, రాజకీయ పార్టీల అభిప్రాయాలను అన్నింటిని బేరీజు వేసుకుని దానిని బట్టి స్పందించేందుకు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నయా భారత్ పార్టీ ఏర్పాటుపై కెసిఆర్ స్టైల్ స్పందించిన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని చెప్పడంతో, ఇప్పుడు కాకపోతే మరో కొద్ది రోజుల్లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నయా భారత్ పార్టీకి సంబంధించి మీడియాకు లీకులు అందడం వెనుక కేసిఆర్ వ్యూహం ఉందనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి