ఈ విషాదకర ఘటన విశాఖపట్నం లో వెలుగు లోకి వచ్చింది. గాజువాక పెంటయ్య నగర్ కు చెందిన కొండపల్లి సుధీర్ కుమార్ బీటెక్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ఎక్కడ ఉద్యోగం దొరకని పరిస్థితి నెలకొంది.. దీంతో మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల కు చేయూతగా నిలవాలి అనుకున్న తనకు పూర్తిగా నిరాశ ఎదురు కావడం తో.. తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో గుడ్ బాయ్ ఎవ్రీ వన్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు... మధ్యాహ్నం భోజనం చేసి స్కూటీపై బీచ్ కి వెళ్ళాడు. కాసేపటికి బీచ్ లో విగతజీవిగా మారిపోయాడు యువకుడు.
కమ్యూనిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించడం తో హుటా హుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిది ఆత్మహత్య గా తేల్చిన పోలీసులు... మృతుడి తల్లిదండ్రులను పిలిచి మృతదేహాన్ని అప్పగించారు. అయితే చేతికొచ్చిన కొడుకు చేయూతగా నిలిచి తమకు అండగా మారతాడు అనుకుంటే ఇలా విగతజీవిగా మారిపోయాడు అంటూ ఆ తల్లిదండ్రుల విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి