తన మేనత్త కుటుంబం పై దుండగులు దాడి చేసి తన మామయ్యను హత్య చేయడం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను అంటూ తెలిపారు సురేష్ రైనా. అయినప్పటికీ సీఎస్కే జట్టులో సురేష్ రైనా లేకపోవడాన్ని మాత్రం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి క్రమంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు సురేష్ రైనా అద్భుతం నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా చేశాడు. ఫ్యాన్స్ అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు. జమ్మూకాశ్మీర్లో అప్ కమింగ్ క్రికెటర్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు సురేష్ రైనా.
ఈ మేరకు అక్కడి అధికారులతో సమావేశమై పలు ప్రణాళికలను కూడా వివరించాడు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు సురేష్ రైనా. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ను కలిసిన సరైన... కశ్మీర్లో క్రీడలను మరింతగా ప్రోత్సహించి ఎంతో మంది క్రీడాకారుల లోని ప్రతిభను వెలికి తీసే విషయంపై కీలకంగా చర్చించాడు. అయితే క్రీడాకారులను ప్రతిభను వెలికితీసేందుకు నిర్ణయించుకున్న సురేష్ రైనా.. దీనికోసం అద్భుతమైన నిర్ణయం తీసుకుని... కాశ్మీర్లో కి వెళ్లి మరీ చర్చలు జరగడం అభిమానులందరినీ మరింత గర్వపడేలా చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి