అప్పటినుండి రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు నిరసనగా గురువారం చండీగఢ్ లో జరగనున్న ప్రదర్శనకు హాజరు కావడానికి అక్కడికి చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ బాదల్ ను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల బాధలను ప్రభుత్వానికి తెలియచేయడానికి వచ్చిన నన్ను అరెస్టు చేశారని, కానీ మా ఉద్యమాన్ని ఆపలేరని అలాగే తమ నోళ్లను మూయించలేరని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అకాలీదళ్ నాయకులు గురువారం వేర్వేరుగా మూడు చోట్ల రైతు ర్యాలీలను నిర్వహించింది. ఈ ఒక్క విషయంలో రైతులకు చేసిన అన్యాయంతో ఎన్డీయే ప్రభుత్వపతనం ఖాయమని ఈ సందర్భంగా ప్రసంగించిన రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. వారితో పాటుగా హర్ సిమ్రత్ బాదల్ కూడా గొంతు కలిపి వారి ఆవేదనను మరింత సపోర్ట్ చేసారు. ఇదంతా నడిపిస్తున్న తెరవెనుక నాయకులు త్వరలోనే తమ తప్పును తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ విధంగా ప్రజలకు బాసటగా నిలిచే నాయకులను అరెస్టు చేసుకుంటూ పోతే ఇక ముందు ఎవరూ ముందుకు రారని ప్రజలంతా హర్ సిమ్రత్ బాదల్ కు అండగా నిలుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి