హైదరాబాద్ నగరం పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఒకటేమిటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు హైదరాబాదులో పర్యాటకులను ఎప్పటికీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఎప్పుడూ పర్యాటక శోభను సంతరించుకుని ఉంటాయి. ఇక హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా ఉన్న దుర్గం చెరువు ప్రస్తుతం పర్యాటక శోభను సంతరించుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత సుందరంగా మారిపోయింది. దీంతో దుర్గం చెరువు కి  సందర్శకుల తాకిడి రోజు రోజుకి పెరిగిపోతోంది. పర్యాటక ప్రాంతాలను ప్రారంభించు కునేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే.




 దీంతో ఇప్పటికే రాష్ట్రంలో ని పలు పర్యాటక కేంద్రాల ను ప్రారంభించ్చింది. ఈ క్రమంలోనే దుర్గం చెరువు కూడా పర్యాటకులతో నిండిపోతుంది. ఇప్పుడు పర్యాటకులు అందరికీ మరింతగా ఆకర్షించేందుకు దుర్గం చెరువు లో బోటింగ్ సేవలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. తెలంగాణ మంత్రులు దుర్గం చెరువు లో బోటింగ్ సేవలను ప్రారంభించారు. అయితే ప్రతి ఒక్కరూ కేబుల్ వంతెనపై ఎంతో క్రమశిక్షణగా మెలగాలని సూచించిన మంత్రులు... సెల్ఫీలు దిగకూడదు అంటూ సూచించారు. అంతేకాదు మరో శుభవార్త కూడా చెప్పారు.




 దుర్గం చెరువు లో పర్యాటకుల సంఖ్య కు అనుగుణంగా రాబోయే రోజుల్లో బోట్ల సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇక నగరవాసులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కల నెరవేరింది అనే చెప్పాలి. దుర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జి ప్రారంభం కావడమే కాదు ప్రస్తుతం బోట్  సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో పర్యాటకులు అందరికీ శుభ వార్త అని చెప్పాలి. దీంతో దుర్గం చెరువు కి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా  సమయం అయినప్పటికీ కేబుల్ బ్రిడ్జి ని చూసేందుకు ఎంతో మంది సందర్శకులు పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: