ఐపీఎల్ 2020 సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ఊహించని విధంగా వరుసగా  ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో ఎంతో సమతూకం తో కనిపిస్తున్న జట్టుకు... ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం ఊహించని షాక్ ఇస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 మ్యాచ్ లలో  విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ కాపిటల్స్ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ జట్టును తన వ్యూహాలకు ఎంతో సమతూకంగా ముందుకు తీసుకెళుతున్నారు.



 అయితే వరుసగా గాయాల బారిన పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు జట్టు కు దూరమవుతుండడం జట్టును క్రమక్రమంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు  తెలుస్తుంది. ఇటీవలే చేతి వేలు గాయం కారణంగా జట్టులో సీనియర్ స్పిన్నర్ గా ఉన్న అమిత్ మిశ్రా పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో కీపర్ రిషబ్ పంత్ తొడ కండరాలు పట్టేయడంతో ...  ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ కి దూరం అయ్యాడు. అతని ప్లేస్ లో వచ్చిన మరో ఆటగాడు బ్యాటింగ్ విషయంలో తేలిపోయాడు.



 ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు  ఫాస్ట్ బౌలర్ గా ఉన్న ఇషాంత్ శర్మ కూడా పక్కటెముకల గాయం కారణంగా జట్టు కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఎక్కువగా స్థానాన్ని సంపాదించుకోలేదు ఇశాంత్ శర్మ. సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో అందుబాటులో ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రాక్టీస్ స్పెషల్స్ కే పరిమితమయ్యాడు. ఇక ఇటీవలే గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో జట్టుకు దూరమైన ఆటగాళ్ల స్థానంలో ఎవరిని తీసుకోవాలి అనే దాని పై ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  అయోమయంలో పడుతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ కి బ్రేక్ పడటమే కాదు 100 అపజయాలు సాధించిన జట్టుగా కూడా చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో ఆటగాడు కూడా దూరమవడంతో ఓకే మ్యాచ్  ఓటమితో 3 ఎదురుదెబ్బలు తగిలాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: