ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్తిగా రాష్ట్రం మొత్తం జలదిగ్బంధంలో వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టం అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. తెలంగాణ తెలంగాణ రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షాల కారణంగా వరదలు లో మునిగి పోయింది. దీంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ జల దిగ్బంధం లోకి వెళ్ళిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



 ఇక గ్రామాలు పట్టణాల్లో పరిస్థితి కూడా మరింత అధ్వానంగా మారిపోయింది. ఈ సమయంలో భారీ వర్షం కురిసింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికొచ్చిన పంట కాస్తా పూర్తిగా ధ్వంసం కావడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు. అయితే అతివృష్టి అనావృష్టి చివరికి రైతుల ముఖంలో మాత్రం చిరునవ్వు పెరిగిపోతూనే ఉంది ప్రతి ఏడాది. ఇక దాదాపుగా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్ల గా రెండు వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇటీవల తెలంగాణ వ్యవసాయ శాఖ కూడా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఇక వరదల్లో మునిగి తేలిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అటు వివిధ రాష్ట్రాలు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.



 ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే మళ్లీ భారీ వర్షాలు ఉన్నాయని ఇటీవల వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు భారీ వర్షం ముప్పు తప్పినట్లే తెలుస్తుంది. గత వారం రోజులుగా భారీ వర్షాలు వరదలతో ఇబ్బందిపడిన ప్రజలందరికీ ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణ లోని పలు జిల్లాల్లో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రానికి జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్ ఉపసంహరించుకుని ఎల్లో అలర్ట్  కొనసాగిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: