ఈ మధ్యకాలంలో కేక్ కటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయిన విషయం తెలిసిందే. సాధారణంగా ఒకప్పుడైతే కేవలం పుట్టిన రోజులకు మాత్రమే కేక్ కటింగ్ చేసే వాళ్ళు. కానీ ప్రస్తుతం ఎలాంటి శుభ సందర్భం అయినా  దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ కటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. పుట్టినరోజు వేడుకలకు అయితే పెద్ద పెద్ద కేకులు తెచ్చి కటింగ్ చేయడం చూస్తూనే ఉంటారూ . ఈ మధ్యకాలంలో పుట్టినరోజు వేడుకలు ఎక్కడ చూసినా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.



గతంలో అయితే సామాన్య ప్రజలు సాదాసీదాగా బర్త్ డే వేడుకలు జరుపుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో పేదవారు ధనికులు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అందరిలా కాకుండా భిన్నంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఎంతోమంది యువకులు ఆశ పడుతూ ఉంటారు. అందరికంటే భిన్నంగా బర్త్ డే వేడుకలు జరుపుకోవడం కారణంగా  ఫ్రెండ్స్ లో తమకి హవా ఉంటుందని భావిస్తూ ఉంటారు.



 అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ పుట్టినరోజు వేడుకలో భాగంగా కేక్ కట్ చేయడానికి పెద్ద పెద్ద ఖడ్గాలు వాడుతున్న విషయం తెలిసిందే. పోలీసులు బర్త్ డే వేడుకలలో ఖడ్గం వాడ కూడదు అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎవరూ వినకుండా నిర్లక్ష్యంగా పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేయడానికి ఖడ్గం వాడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇలా ఖడ్గం తో పుట్టినరోజు వేడుకలు చేసుకుని చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది మహారాష్ట్రలో. నాగ్ పూర్ కి చెందిన నిఖిల్ అనే యువకుడు ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నాడు.  ఈ సందర్భంగా తన స్నేహితులు తెచ్చిన కేక్ కట్ చేయడానికి సాధారణ  కత్తి కాకుండా ఖడ్గం ఉపయోగించాడు. ఈ ఫోటోలను నిఖిల్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: