రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. తాగు, సాగునీటి అవసరాలు ఉన్నాయని అభిప్రాయపడిన ఎన్జీటీ ..ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది.
పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతనెల 3న విచారణ పూర్తి చేసి ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు సామర్థ్యం రెట్టింపు చేసినందున పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందేనని వాదించింది.
రాయలసీమ ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వాదనను ఎన్జీటీ తిరస్కరించింది. తాగునీటి పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని ఎన్జీటీ గుర్తు చేస్తూ..ప్రాజెక్టు డీపిఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది.
మొత్తానికి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పెద్ద షాకే ఇచ్చింది. అంతేకాదు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరని ఎన్జీటీ చెన్నై కోర్టు తీర్పు చెప్పేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లడం తగదని ఏపీ ప్రభుత్వానికి సూచలు చేసింది. తాగు, సాగునీటి ఆవశ్యకతపై తన అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఎన్జీటీ.. కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖను ప్రస్తావించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి