పూర్తిగా చైనాని భారత్ నుంచి నిషేధించేందుకు భారత ప్రభుత్వం మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. అదే సమయంలో దౌత్య పరంగా కూడా విజయవంతం అవుతూ చైనా శత్రు దేశాలకు మిత్ర దేశంగా మారుతున్న భారత్.. మరో వైపు నుంచి కూడా ఆర్థికంగా దెబ్బ కొడుతుంది. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకు ఆర్థికంగా రోజురోజుకు కుదేలవుతోంది చైనా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం చైనా కు మరో ఆర్థిక దెబ్బ కూడా తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజురోజుకి చైనా ఫోన్లకు గిరాకీ పడిపోతుంది. చైనా లో తయారైన ఫోన్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది అన్న విషయం తెలిసిందే.
కానీ ప్రస్తుతం రోజురోజుకి చైనా ఫోన్ లకి ఉన్న డిమాండ్ కాస్త పడిపోతుందో చైనా ఆర్థికంగా మరింత కుదేలవుతోంది. ఏకంగా చైనాకు సంబంధించినటువంటి ఫోన్ల అమ్మకాలు 15 శాతం వరకు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం పడిపోగా ఈ 15 శాతంలో అత్యధికంగా ఇండియాలోనే చైనా ఫోన్లు మార్కెట్ తగ్గిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇలా చైనా ఫోన్లకు 15 శాతం మార్కెట్ తగ్గిపోవడం అనేది కీలకం గా మారిపోయింది. దీంతో చైనాకు ఆర్థికంగా ఎంతగానో దెబ్బ పడింది అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో ఇలా ఆర్థికంగా చైనాకు మరిన్ని షాకులు తగిలే అవకాశం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి