తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్న దుమారం రేప్ వ్యాఖ్యలు చేశారు.. మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. నంద్యాలలో సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు చూశాక రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఉందా.. జగన్ స్వామ్యం నడుస్తోందా అనే అనుమానం కలుగుతోంది అంటూ అవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పై, వారిని పరామర్శించిన వారి పై, టీడీపీ నేతల పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే, జగన్ ప్రభుత్వం, నలుగురి మరణానికి కారకులైన పోలీసుల పై బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఏ పాపం ఎరుగని అబ్దుల్ సలాం పై దొంగతనం అభియోగాలను మోపడం ఎంత వరకు సమంజసం అంటూ ద్వజమెత్తారు..
నంద్యాల ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కనుసన్నల్లోనే అతని ప్రధాన అనుచరుడైన బంగారు దుకాణం యజమాని, సలాంపై తప్పుడు కేసులు పెట్టారు.సలాం కుటుంబం చావులకు కారకులైన పోలీసుల పై క్రిమినల్ కేసులుపెట్టి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసి వారికి శిక్షపడేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.. అంటూ బుద్దా అన్నారు. రూ.25లక్షల పరిహారమిచ్చి, జరిగిన దారుణాన్ని ముఖ్యమంత్రి కప్పిపెట్టాలని చూశాడు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు అవసరం లేదు, చనిపోయేముందు సలాం విడుదల చేసిన సెల్ఫీ వీడియో చాలు. ఈ ప్రభుత్వం పోలీసులను కూడా విభజించి పాలిస్తోందని పోలీస్ సంఘాలు తెలుసుకుంటే మంచిది.. ఈ సందర్బంగా ఆయన అన్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి