మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణ శిక్షలు విధించినా ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో మహిళలు ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతున్న మృగాలు  ఆడపిల్ల కనిపిస్తే చాలు పశువుల్లా  మీద పడిపోయి కామ వాంఛలను తీర్చుకుంటున్నారు. మొన్నటి వరకు మహిళలపై పరాయి వాళ్ళు మాత్రమే అత్యాచారం చేసే వాళ్ళు కానీ ప్రస్తుతం సొంతింటి వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతుండ  డంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు ఎంతోమంది ఆడపిల్లలు.



 ఆడపిల్ల ఒకసారి ఇంటి గడప దాటి బయట అడుగుపెట్టింది అంటే చాలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అని అనుక్షణం ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనలో ఉండే విధంగా మారిపోయింది నేటి రోజుల్లో పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఏకంగా తాత వయస్సు ఉండే ముసలి వాళ్లు సైతం శుభం తెలియని చిన్నారులు లైంగిక వేధింపులకు గురిచేయడం అత్యాచారాలకు పాల్పడడం  హత్యలు చేయడం లాంటి ఘటనలు కూడా తెర మీదికి వచ్చి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.



 ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. ఏకంగా నాలుగేళ్ల చిన్నారి పై కన్నేసిన ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. 4 ఏళ్ల బాలిక ఇటీవలే చాక్లెట్లు కొనుక్కోవడానికి షాప్  కి వెళ్ళింది  ఈక్రమంలోనే ఆటో డ్రైవర్ గణేష్ కామం తో ఊగిపోయాడు  ఇక సదరు బాలిక దగ్గరకు వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో షాక్ అయిన తల్లిదండ్రులు గణేష్ ని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించగా అరెస్టు చేసిన పోలీసులు ఫోక్సో చట్టం కింద  కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: