ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని దేశాలకు ఒక ఉదాహరణ గా మారిపోయింది. ప్రతి విషయంలో కూడా ప్రస్తుతం పాకిస్థాన్ ఒక ఉదాహరణ గానే మారిపోయింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తమ దేశ ప్రయోజనాలను గాలికొదిలేసింది అన్న విషయం తెలిసిందే. దీంతో తమ దేశంలో విదేశీ మారక విలువ రోజురోజుకు తగ్గిపోతున్న పట్టించుకోకుండానే ఉగ్రవాదం పైనే ఎక్కువగా ఆధారపడింది పాకిస్తాన్. ఉగ్ర వాదులతో ఇతర దేశాలలో అంశాల సృష్టించడం పైన ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో అక్కడి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది... ఇలా ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న దానికి పాకిస్తాన్ ఉదాహరణ మారింది.




 అదేసమయంలో ఇటీవలే తమకు ఎప్పుడు ఆర్థికంగా అండగా నిలిచే సౌదీ అరేబియా దేశం పై ఆధిపత్యం సాధించాలి అనుకున్న పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇలా మిత్ర  దేశాల విషయంలో తోక జాడించ కూడదు అనేదానికి పాకిస్తాన్ ఒక ఉదాహరణగా మారిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం చైనా బానిస దేశం గా మారిపోయిన పాకిస్తాన్.. తమ దేశంలో లో చైనా సైన్యం ఎన్నో  అరాచకాలకు పాల్పడుతున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో.. దేశంలో ప్రభుత్వం ఎలా పాలతో చేయకూడదు అనే దానికి ఉదాహరణగా మారిపోయింది పాకిస్తాన్.



 అదే సమయంలో తమ శక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండా భారత్ లాంటి పెద్ద దేశాలు విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడు దెబ్బతింటూ ఉండే పాకిస్తాన్... ఒక దేశం ఎలా ఉండకూడదు అనే దానికి ఉదాహరణ గా మారిపోయింది. అంతే కాకుండా ఇటీవల ఫ్రాన్స్ తో  వివాదానికి తెరలేపిన పాకిస్తాన్ తమ దానికి సహాయం అందేలా ఉన్న అన్ని తలుపులను మూసి వేసే విధంగా చేసుకోవడం చూస్తే... అగ్రరాజ్యాలతో ఎలా వ్యవహరించకూడదు అనేదానికి ఉదాహరణగా మారిపోయింది పాకిస్తాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: