ఈ మధ్య కాలంలో ఏ వస్తువులో  చూసిన తినే ఆహార పదార్థాల నుంచి వంటలకు వాడే నూనెలు వరకు కూడా అన్నీ కల్తీ అవుతున్నాయి. స్వచ్ఛమైనది ఏది కల్తీ  అయింది ఏది అని  తెలుసుకోవడం ఎంతో కష్టం గా మారిపోతుంది నేటి రోజుల్లో. ముఖ్యంగా నూనె విషయంలో ఎక్కువ కల్తీ జరుగుతున్నట్లు ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులు కూడా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కూడా సూచనలు చేశారు. సాధారణంగా అయితే భారతదేశంలో ఆవనూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అందరు. ఎన్నో రకాల వంటలు తయారు చేయడానికి ఎక్కువగా ఆవనూనెను వాడుతూ ఉంటారు. ఇక భారతదేశంలో ఎంతో డిమాండ్ వున్న ఆవనూనె ఒకప్పుడు ఎంతో స్వచ్ఛమైనది గా దొరికేది కానీ ప్రస్తుతం అందులో కూడా కల్తీ అవుతుంది.



 ఆవనూనెలో ఎక్కువగా ఆర్జీమోన్ నూనె కలిపి కల్తీ చేస్తున్నారు ఎంతోమంది మోసగాళ్లు. అయితే మీరు వాడే ఆవ నూనె కల్తీ చేయబడిందా లేదా అని ఎంతో సులభంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఆర్జీమోన్ నూనెను అజీం విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇక నూనె యొక్క క్వాలిటీ పెంచడానికి ఈ ఆర్జీమోన్ నూనెను ఆవ  నూనెలో కలుపుతూ ఉంటారు. ఆర్జీమోన్ నూనెను వాడటం ద్వారా ఎక్కువగా అంటూ  వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో  కూడా వెల్లడైంది. అంతే కాదు ఎర్ర రక్త కణాలు దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నది కూడా పలు అధ్యయనాలు చెప్పాయి .



 అయితే మీ ఆవనూనె కల్తీ  అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఎంతో సులభమైన మార్గం ఉంది. 5 మి.లీ ఆవ నూనెను టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకొని 5 మి.లీ నైట్రిక్ యాసిడ్ కలపి  ట్యూబ్‌ను మెల్లిగా కదిలించండి. ఒకేవేళ ఆవ నూనె కల్తీ కాకపోతే, అది ఆమ్ల పొరలో రంగు మార్పును చూపించదు. కల్తీ అయితే ఆవ నూనె విషయంలో, ఆమ్ల పొరలో ఒక నారింజ-పసుపు నుంచి ఎరుపు రంగు అభివృద్ధి చెందుతుంది.ఆర్జీమోన్ నూనె సాంగినారిన్ అనే ఓ విషపూరిత పాలిసైక్లిక్ సాల్ట్ ఉంటుంది. మనం టెస్ట్ ట్యూబ్ లో అవ నూనె, నైట్రిక్ యాసిడ్ కలిపినప్పుడు సాంగునారైన్ నైట్రేట్ ఏర్పడటం వల్ల వెంటనే రంగు మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: