గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బిజెపికి సవాలుగా మారాయి. దుబ్బాకలో రఘునందన్ రావు గెలిపించుకున్న బిజెపి ఇప్పుడు ఎలా అయినా హైదరాబాద్ లో కూడా సత్తా చాటి మేయర్ పీఠం మీద తమ అభ్యర్థిని కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది అందుకు తగ్గట్టే జాతీయ స్థాయి నుంచి నేతలు కూడా వరుసగా హైదరాబాద్ క్యూ కట్టారు. అయితే తెలంగాణలో కుల రాజకీయాలు పనికిరావు అని చాలా మంది చెబుతుంటారు. అయినా సరే ఆ యాంగిల్ కూడా ఎందుకు వదలాలి అని భావించిన బిజెపి ఏపీకి చెందిన నేతలు రంగంలోకి దింపి కుల రాజకీయం చేస్తోంది. 



తాజాగా అందుతున్న సమాచారం మేరకు కుల సంఘాల నేతలతో బీజేపీ నేతలు సమావేశం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ తన సొంత సామాజిక వర్గమైన ఆర్యవైశ్య ప్రముఖులను కలిసి బీజేపీకి ఈసారి ఓటు వేయించాలని కోరినట్టు సమాచారం. బీజేపీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే మన సామాజిక వర్గానికి మంచి జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆయనతో పాటు మరో ఎంపీ సీఎం రమేష్ కూడా హైదరాబాద్ లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను కలిసి ఈసారి బీజేపీకి ఓట్లు వేయించాలని కోరుతున్నట్లు సమాచారం .



 ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్ వచ్చి ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. తాజా సమాచారం మేరకు ఆయన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తన సొంత సామాజిక వర్గమైన కాపు సంఘ నేతలతో ఈరోజు సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కో నేతను బిజెపి మీ లైన్ లో పెట్టి ఆయా వర్గాల నేతలతో ఈ కుల రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: