జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదలైనప్పటి నుంచి తెలంగాణ తెలంగాణ లో రాజకీయ వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ.. ఎంతో వ్యూహాత్మకం గా ప్రణాళికాబద్ధంగా ప్రస్తుతం  ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం ప్రచారానికి మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉన్న  నేపథ్యంలో ఉన్న కొంత సమయాన్ని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బాగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.


 ఇక ఆయా నియోజకవర్గాల్లో డివిజన్లలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా టిఆర్ఎస్ పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రచారం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని.. డివిజన్ ఎలా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అంటూ ఓటర్లకు సూచిస్తున్నారు టిఆర్ఎస్ ముఖ్య నేతలు. ఈ క్రమంలోనే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ అందరూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసిందే.



 ఇటీవలే మేడ్చల్ నియోజకవర్గం లోని 97 వ డివిజన్ అయినా సోమాజిగూడ లో టిఆర్ఎస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం నిర్వహించారు జయప్రకాశ్ నగర్ నగర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనీ  టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.  సోమాజిగూడ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సంగీత శ్రీనివాస్ యాదవ్ కు ఓటర్లు అందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఓటుతోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: