తెలంగాణ ఉత్కంఠ భరితంగా సాగిన గ్రేటర్ ఎన్నికలలో ఈ సారి కూడా అధికార
పార్టీ టీఆరెఎస్ గెలుపు ఖాయమని తెలుస్తోంది. నిన్న ఎగ్జి ట్ పోల్స్ చెప్పట్టిన
సర్వేలో కారు జోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అది ఈరోజు నిజం కాబోతోంది.. ఎన్నికల ఫలితాలు కారుకు అనుకూలంగా వస్తున్నాయి. మొదట పదకొండు గంటలకు వెలువడిన మొదటి ఫలితాలు కాస్త నిరాశను మిగిల్చాయి..దీంతో ప్రజలు నిరాశ మిగిల్చిన కూడా ప్రస్తుతం వెలువడిన ఫలితాలు మాత్రం కారుకు బ్రేకులు వేయదని తెలుస్తోంది..
తెరాస నేతలు, కార్యకర్తలు మీడియాతో ముచ్చటిస్తున్నారు.. గెలుపు పై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనం
కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు..గులాబీ జెండా ఈ ఎన్నికల్లో కూడా ఎగురుతుంది అంటూ చెప్తున్నారు. తాజాగా టీఆరెఎస్ నేతలు
కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కారుకు బ్రేకులు వేసే దమ్ము ఎవ్వరికీ లేదని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పిల్లులు ఎన్ని వచ్చినా కూడా చివరికి మిగిలేది
పులి కేసీఆర్ పులి ఓట్లను కొల్లగొట్టేస్తున్నారు అంటూ
తెరాస నేతలు అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని, కారుకు బ్రేకులు లేవని, మేయర్ పీఠం తమదేనని టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.. వందకుపైగా సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, సీఎం కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. కాగా టీఆర్ఎస్ 54, బీజేపీ 33, ఎంఐఎం 22, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు టీఆరెఎస్ ముందంజలో ఉంది..