గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు విజేత, ఎవరు పరాజిత అన్న లెక్కలు కనుక తీస్తే విజేత కచ్చితంగా బీజేపీయేనని చెప్పాలి. ఎందుకంటే కేవలం నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఇపుడు ఏకంగా 49 సీట్లు సాధించింది. అదే టీయారెస్ విషయం తీసుకుంటే గతసారి 99 సీట్లు సాధించి ఇపుడు 56 సీట్లకు పడిపోయింది. అంటే బీజేపీ కొత్తగా 45 సీట్లను గెలుచుకుంటే టీయారెస్ మాత్రం ఏకంగా 33 సీట్లను కోల్పోయింది. పైగా మెజారిటీకి కూడా దూరంగా ఉండిపోయింది.

ఇంకో విషయం ఏంటి అంటే బీజేపీకి టీయరెస్ కి మధ్య సీట్ల గ్యాప్ కూడా పెద్దగా ఏమీ లేదు. కేవలం ఏడు సీట్లు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే టీయారెస్ దరిదాపుల్లోకి బీజేపీ వచ్చేసింది. హడావుడి గా ఎన్నికలు టీయారెస్ పెట్టకపోయి ఉంటే షెడ్యూల్ ప్రకారం మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగితే కనుక కచ్చితంగా గ్రేటర్ పీఠం పైన కాషాయం జెండా రెపరెపలాడేది అన్నది ఈ ఫలితాలను చూసి అంతా అంగీకరిస్తారు.

చేతిలో ఫుల్ పవర్ తో పాటు ఇంతలా  అన్నీ అనుకూలం చేసుకుని కూడా బరిలోకి దిగిన టీయారెస్ కి ఇలాంటి ఫలితాలు వస్తే రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉంటుందో వేరేగా చెప్పాల్సింది లేదు. ఈ విజయం మాత్రం కచ్చితంగా బీజేపీకి దక్కుతుంది. గులాబీ పార్టీ  కొత్తగా చెప్పుకునేందుకు భుజాలు ఎగురవేసేందుకు కూడా ఏమీ లేదు. వంద సీట్లు సాధిస్తామని బరిలోకి దిగిన టీయారెస్ నంబర్ సగం వద్దనే ఆగిపోయింది అంటే కచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

మరో వైపు చూసుతే ఉద్యోగుల పోస్టల్  బ్యాలెట్ చూస్తే టీయారెస్ మీద వ్యతిరేకత భారీ ఎత్తున  కనిపిస్తోంది. అలాగే వివిధ సెక్షన్ల ప్రజల వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. 45 శాతం పోలింగ్ కే ఇంతలా టీయారెస్ పట్ల  వ్యతిరేకత వస్తే మరింత మంది కనుక ఓటింగునకు వస్తే టీయారెస్ మరెన్ని సీట్లు కోల్పోయేదో అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: