కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం విద్యారంగంపై ఎంతగానో పడింది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వచ్చిన నాడు  మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ తెరుచు కున్నప్పటికీ కూడా ప్రత్యక్ష విద్యాబోధన కాకుండా ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే విద్యా సంస్థలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొనసాగించింది.


 కాగా ఇటీవల తెలంగాణ విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2019 సంవత్సరంతో పోలిస్తే కరోనా వైరస్ సంక్షోభం సమయంలోనే విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ పెరిగింది అని తెలిపింది. 2019 తో పోలిస్తే ఈ ఏడాది డిగ్రీ కోర్సులో చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది కేవలం 1,87,774 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో  అడ్మిషన్లు తీసుకున్నారని కానీ ఈ సారి మాత్రం 2,12,429 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. కరోనా సంక్షోభం సమయంలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఎక్కడా తగ్గలేదు అంటూ తెలిపింది.



 ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1059 కాలేజీలలో నాలుగు లక్షల 24 వేల 315 సీట్లు ఉండగా దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ లో భాగంగా రెండు లక్షల 12429 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ఏడాది డిగ్రీ కోర్సులో చేరిన ఎక్కువ మంది విద్యార్థులు బీకామ్ గ్రూప్ తీసుకున్నారు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. దాదాపు 85వేల 691 మంది విద్యార్థులు బీకామ్ గ్రూప్ తీసుకున్నారని.. ఇప్పుడు వరకు ఇదే ఎక్కువ అంటూ విద్యాశాఖ తెలిపింది.  ఇలా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: