ఈ క్రమంలోనే కస్టమర్లు అందరికీ కూడా ఎంతో సులభంగా హోమ్ లోన్స్ అందించేందుకు ఈ రెండు సంస్థలు సిద్ధమయ్యాయి. కస్టమర్లకు ఉద్యోగులకు హోమ్ లోన్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమైంది స్టేట్ బ్యాంక్. మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్ కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అయితే మహేంద్ర లైఫ్ స్పేస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. స్టేట్ బ్యాంకు జత కట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. ఈ భాగస్వామ్యం వల్ల ఇరు సంస్థల కస్టమర్లకు ఎంతో సులభరీతిలో... సరళమైన వడ్డీ రేటుకి హోమ్ లోన్స్ లభిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.
ఇది ప్రస్తుతం ఇరు సంస్థల కస్టమర్లకు గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఇక ఈ రెండు సంస్థలు జతకట్టడం కారణంగా అతి తక్కువ వడ్డీకే ప్రస్తుతం ఎంతో మంది కస్టమర్లు హోమ్ లోన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కస్టమర్లకు ప్రయోజనం కలిగే విధంగా భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా ఈ సంస్థలు సిద్ధమయ్యాయి. కాగా స్టేట్ బ్యాంక్ ఇప్పటికే మహేంద్ర లైఫ్ ఫేస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని.. దేశంలోని పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అంటూ పేర్కొన్నారు స్టేట్ బ్యాంక్ రియల్ ఎస్టేట్ విభాగం హెడ్ శ్రీకాంత్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి