చైనాతో ఏ క్షణంలో  యుద్ధం తలెత్తిన సమర్థవంతంగా చైనాను మట్టుబెట్టి విజయం సాధించే దిశగా ప్రస్తుతం భారత్  ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శరవేగంగా క్షిపణులను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడమే కాదు అటు విదేశాలలో అభివృద్ధి చేసినట్టు వంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను కూడా భారత అమ్ములపొదిలో చేరుస్తుంది. ఈ క్రమంలోనే భారత ఆర్మీ క్రమక్రమంగా ఎంతో పటిష్టంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు ప్రపంచంలో లేని సరికొత్త టెక్నాలజీతో కూడిన క్షిపణి వ్యవస్థ ను తయారు చేస్తూ భారత అమ్ములపొదిలో చేరుస్తూ ముందుకు సాగుతోంది.



 ఈ క్రమంలోనే ఇటీవలే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ శరవేగంగా ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ప్రయోగాలు నిర్వహిస్తూ విజయవంతం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో మరింత అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు... ఇక విదేశీ ఆయుధ తయారీ సంస్థలు కూడా భారత్లోకి ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే పలు విదేశీ ఆయుధ తయారీ సంస్థలు కూడా భారత్లోకి ఆయుధ తయారీ కోసం ముందుకు వస్తున్నాయి. కాగా ఇటీవలే సరికొత్త టెక్నాలజీతో కూడిన మిసైల్స్ అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కూడా కేటాయిస్తుంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే మరో కీలక ముందడుగు వేసింది భారత్.  భారత్కు చెందినటువంటి బీడీఎల్.. ఫ్రెంచ్ కి   సంబంధించినటువంటి తేల్స్  గ్రూప్ కలిసి స్టార్ స్ట్రీక్  అనే మిస్సైల్  అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మిస్సైల్ యొక్క గరిష్ట వేగం ఇప్పటి వరకు ఈ కేటగిరీ లో ఉన్న మిస్సైల్స్ అన్నింటి కంటే  వేగవంతంగా ఉంటుంది. అంతేకాదు ఈ మిస్సైల్ ను జామ్  చేయగలిగినటువంటి  కౌంటర్ కూడా ఇప్పటివరకు లేదట. భూమి మీద నుంచి ఎలాంటి గగనతల లక్ష్యాన్నైనా ఇది సులువుగా ఛేదించగలదట. ఇక ఈ మిస్సైల్ అటు చైనా విమానాలు తుక్కు తుక్కు అవుతాయని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: