తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది.. ఇన్నాళ్లు తెరాస పార్టీ ఆధిపత్యం తో టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఎత్తులు పైఎత్తులు వేయనవసరం రాలేదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బీజేపీ రాకతో తెరాస నేతలు తుప్పుపట్టిన తమ మెదళ్ళకు పనిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది.. ఓ వైపు బండి సంజయ్ తెరాస పై విమర్శలు చేసుకుంటూ పోతుంటే తెరాస నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం పార్టీ అధిష్టానానికి ఇబ్బంది గా మారింది.. వారిలో చైతన్యం కలిగించేలా కేటీఆర్ నడుంబిగించారు.  బలపడుతున్న బీజేపీ పార్టీ కి అడ్డుకట్ట వేసేందుకు అన్ని నియోజక వర్గాల నాయకులను యాక్టివేట్ చేస్తున్నారు..

సంక్రాంతి పండుగను కూడా పక్కకు పెట్టి రాబోయే ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నాయకులను లైన్ లో పెడుతున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజక పరిధిలోని నాయకులను హైదరాబాద్ కి పిలిపించుకుని మరీ వారిని ఉత్తేజపరుస్తున్నారు.. అటు దుబ్బాక ఉపఎన్నిక ఇటు.. గ్రేటర్ ఎన్నికల్లో పడిన దెబ్బతో… మరో ఓటమి ఎదురైతే.. ఇమేజ్ మరింతగా దిగజారుతుందని భావించిన పార్టీ కార్యవర్గం  నాగార్జున సాగర్ నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే ఈ చర్యలు చేయడం చూస్తుంటే తెరాస పార్టీ ఎంత సీరియస్ గా ఎన్నికలను తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలే ముఖ్య పార్టీ నేతలతో జరిగిన ఓ మీటింగ్ లో శాసనమండలికి జరగనున్న ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.ఇంకా నాగార్జున సాగర్ విజయావకాశాలను కూడా తీవ్రంగా చర్చించారట.  ఇకపోతే నాగార్జున సాగర్ లో విభిన్నమైన ప్రచారానికి బీజేపీ సిద్ధమయ్యింది.. ఒకే దెబ్బ కు రెండు పిట్టలు అన్నట్లు తమ ప్రచారం తో ఇటు తెరాస ను, అటు కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. జానారెడ్డి మళ్లీ పోటీకి సిద్ధమవడం వెనుక.. కేసీఆర్ అభయం ఉందన్న ప్రచారం జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఇక్కడ గెలుపుకోసం కృషి చేస్తున్న అన్ని పార్టీ లలో ఏ పార్టీ కి విజయం వరిస్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: