టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా.. తాజాగా చేసిన హ‌ల్‌చ‌ల్‌.. రెండు కీల‌క ప‌రిణా మాలను స్ప‌ష్టం చేసింది. ఒక‌ట పార్టీలో దేవినేని ఉమాకు ఉన్న ప్రాధాన్యం.. మ‌రీ ముఖ్యంగా కృష్ణాజిల్లా లో దేవినేని స‌త్తా ఏంటో కూడా ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టేసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దేవినేని ఉమా.. మంత్రి కొడాలి నానిల మ‌ధ్య ఉన్న వివాదాలు ఇప్ప‌టివి కావు. టీడీపీలో ఉన్న నాటి నుంచి త‌న‌ను తొక్కేసేందుకు ఉమా ప్రియార్టీ ఇచ్చార‌నే అక్క‌సు నానిలో ఉంది. ఇది రానురాను పెరిగి.. కొన్నేళ్లుగా బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కు వెళ్లింది.

ఇద్ద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికిచెందిన వారు కావ‌డం.. స‌మ‌కాలికులు కావ‌డంతో ఆదిలో ఇది .. ఇద్ద‌రి మధ్య పోరుగానే అంద‌రూ భావించారు. అయితే.. తాజాగా వివాదం మాత్రం ప‌తాక స్థాయికి చేరిపోయింది. ఇక్క‌డ దేవినేని ఉమా, కొడాలి నాని వ్య‌వ‌హ‌రించిన తీరు ఇరు ప‌క్షాల‌లోనూ త‌ప్పు క‌నిపిస్తోంది. మంత్రిగా ఉండి కొడాలి దూకుడు చూపించ‌డం స‌రికాద‌ని వైసీపీలోనే అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది. ఇక‌, దేవినేని కూడా ఆనుపానులు అంచ‌నా వేయ‌కుండా.. దూకుడుగా స‌వాళ్ల‌కు దిగ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. ఈ ప‌రిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గంట‌ల పాటు సంచ‌ల‌నం సృస్టించినా.. అంతిమంగా ఇరు ప‌క్షాల బ‌లాబలాలే తేలిపోయాయి.

మంత్రిగా కొడాలి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఎవ‌రూ మాట్లాడ‌రు. మ‌రో మూడేళ్ల‌పాటు ఆయ‌న అధికారంలో ఉంటారు క‌నుక‌.. ఆయ‌న‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే.. దేవినేని ఉమా విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మాత్రం.. డిఫ‌రెంట్‌గా ముందుకు సాగ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడకు చెందిన నాయ‌కులుఒక్క‌రంటే ఒక్క‌రు కూడా దేవినేనికి అను కూలంగా బ‌య‌ట‌కు రాలేదు. ఒక్క పేప‌ర్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేదు. జిల్లాస్థాయిలోనూ నాయ‌కులు.. ఎవ‌రికివారుగానే వ్య‌వ‌హ‌రించారు.

మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దేవినేని వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపించింద‌నే కామెంట్లు వెలువ‌డుతున్నాయి. అప్ప‌ట్లో తాను ఒక్క‌డిగానే నిర్ణ‌యాలు తీసుకు న్నార‌ని.. ఎవ‌రినీ కలుపుకొని పోయిన ప‌రిస్థితి లేద‌ని.. ఇప్పుడు మాత్రం అంద‌రూ క‌లిసిరావాల‌నే ఆశ పెట్టుకున్నార‌ని..కానీ, ఈ ప‌రిస్తితి తాజా ఘ‌ట‌న‌తో తేట‌తెల్లం అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిని బ‌ట్టి దేవినేని ఉమా ఎంత‌గా మార్పు చెందాలో స్ప‌ష్టం అవుతోంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే మూడేళ్ల‌లో ఆయ‌న పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మొత్తానికి తాజా ఘ‌ట‌న దేవినేని స‌త్తాను స్ఫ‌ష్టం చేసింద‌ని చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: