ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొంతమంది కీలక నేతలు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉండటంతో అసలు ఆ పార్టీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా బిజెపి కార్యక్రమాలలో కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొనకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో భవిష్యత్తు లేదు అన్న విషయం అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీని ప్రజలు పెద్దగా నమ్మే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు.

ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాలపై రాష్ట్ర ప్రజల్లో చాలా వరకు ఆగ్రహం ఉంది. దాదాపుగా రాష్ట్రం విడిపోయిన ఆరేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని ప్రత్యేకంగా నిధులు గాని ఇచ్చే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందడుగు వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ముందుకు వెళ్లాలి అని భావించడంపై కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి సహాయం చేయాల్సి ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

కాబట్టి బీజేపీ ఏపీలో బలపడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాని పని అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కొందరు బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వదిలేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్తారా టీడీపీ లోకి వెళ్తారా అనేది స్పష్టత రాక పోయినా కచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనతో పాటు దాదాపుగా పది మంది కాపు సామాజికవర్గ నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాపు సామాజికవర్గం నేతలు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నారని వారిలో జనసేన పార్టీ నేతలు కూడా కొంత మంది ఉన్నారని అంటున్నారు. వారందరితో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరవచ్చునని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: