సాధారణంగానే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వాడివేడిగా మారిపోయాయి అని చెప్పాలి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా జగన్ సర్కార్.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య..  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ శరవేగంగా ఏర్పాటు చేస్తూ ఉంటే అటు అధికార పార్టీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 చంద్రబాబు డైరెక్షన్లో..  ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ యాక్షన్ చేస్తున్నారు అంటూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య విమర్శల పర్వం రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. అయితే జగన్ సర్కారు ఇప్పట్లో ఎన్నికల వద్దు  అన్నప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి మరీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీరును తప్పుబడుతూ జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.



 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,  ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఇద్దరూ కూడా ఉన్మాదుల్లాగా వ్యవహరిస్తున్నారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ పోస్ట్ ని అడ్డంపెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రస్తుతం ఒంటెద్దుపోకడలతో ఎన్నికల కమిషన్ ప్రస్తుతం చంద్రబాబు అనుబంధ సంస్థగా మారిపోయింది అంటూ విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.  చంద్రబాబుకు అసలు ఎన్నికల గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: