ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అన్ని బ్యాంకులు కూడా వినూత్నమైన సర్వీసులను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువస్తూ  తమ  కస్టమర్ల సంఖ్య మరింతగా పెంచుకునేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి  అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా తమ కస్టమర్లకు రుణాలు అందించడంలో ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఎంతో ముందు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈ కీలక నిర్ణయం తీసుకున్న ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.  ఇప్పటికే తమ కస్టమర్ల కోసం వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది ఐసిఐసిఐ బ్యాంక్.


 ఇప్పుడు బై  నౌ  పే లేటర్ అనే ఆఫర్ను తీసుకొచ్చింది.  ఇక ఐసిఐసిఐ బ్యాంకు తీసుకువచ్చిన ఈ సరికొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు వారి క్రెడిట్ లిమిట్ ద్వారా ఏదైనా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక డబ్బులు ఆ తర్వాత పే చేయవచ్చు. అయితే ఇక ఐసిఐసిఐ తీసుకొచ్చిన ఈ కొత్త సర్వీస్  ద్వారా ఏదైనా వస్తువులు కొనుగోలు చేస్తే తర్వాత నెల 15వ తేదీ లోపు డబ్బులు మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇక 45 రోజుల వరకు వడ్డీరహిత రుణం లభించినట్లు  అవుతుంది అన్న మాట. కేవలం ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.



 ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా ఈ బెనిఫిట్ పొందేందుకు అవకాశం ఉంటుంది. మీరు ముందుగా ఈ సర్వీసు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీ పేరు పై పే లేటర్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అవుతుంది..  ఇక ఆ తర్వాత మీకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.  అయితే ఈ సర్వీస్ ఉపయోగించుకుంటున్న కస్టమర్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సర్వీస్ ద్వారా ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.  ఇతరులకు డబ్బును పంపించడానికి వీలుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: