మాములుగా చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తరువాత వారి పదవిని మరియు అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతి పరమైన చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది మనము దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో చూశాము. అయితే ఇవన్నీ కూడా సదరు రాజకీయ నాయకుడు ఎందుకు చేస్తారు అని పరిశీలిస్తే ప్రజలకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తన సత్తా ఏమిటో తెలియచేసేందుకు ఇలాంటివి చేస్తూ ఉంటారని తెలిసింది. కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ తనకు సహకరించినంత వరకు ఇలాంటి ఘాతుకాలు మరియు అన్యాయాలు జరుగుతాయి. కానీ అక్కడ వారిలో ఎవరో ఒక సిన్సియర్ ఆఫీసర్ గట్టిగా నిలబడ్డాడో ఎదుటి రాజకీయ నాయకుడు కోర్ట్ మెట్లెక్కాల్సిందే.

ఇలాంటి సంఘటన ఒకటి కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది పొలిటికల్ గా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో ఒక మంత్రి ఒక మంచినీటి సరస్సును పూడ్చి వేసి తనకు నచ్చిన విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు.  కానీ దీనికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ టీవీ అనుపమ ఎదురు నిలిచారు. మంత్రి చేసేది అవినీతి అని సంబంధిత డిపార్ట్మెంట్ కి ఒక నివేదికను సమర్పించారు. దీనిపై సదరు మంత్రి కోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. కానీ కోర్టులో కూడా మంత్రి చేసిందే తప్పని ఋజువయింది.  ఇక చేసేదేమీలేక ఆ తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది.

కొద్ది రోజుల్లోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ప్రతి పక్ష పార్టీలకు ఈ విషయం బాగా ఉపయోగపడనుంది. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఇంతే ధైర్యంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసర్ ఉండడం ఈ సమాజానికి ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఈమె పేరు దేశంలోనే మారుమ్రోగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: