గత కొన్ని రోజుల నుంచి దేశంలో పెట్రోల్ ధరలు ఎంతలా  పెరిగిపోతున్నాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.. ఏకంగా  పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు  కనీసం వాహనం బయటకు తీయాలి అన్న కూడా భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు.  ఈ క్రమంలోనే అత్యవసరమైతే తప్ప వాహనం తీసేందుకు ముందుకు రావడం లేదు. అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏకంగా ఫుడ్ డెలివరీ బాయ్ జాబ్స్ చేసే వారి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.



 సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్ అంటే ఎప్పుడు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉండాల్సి  ఉంటుంది. కానీ భారీగా పెట్రోల్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో డెలివరీ బాయ్స్ కి కూడా ఎంతో ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తమ సంస్థలో పనిచేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ కి రెమ్యూనరేషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది జొమాటో . ఈ విషయాన్ని జొమాటో వ్యవస్థాపకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  తమ  డెలివరీ పార్ట్ నర్లు ఫుడ్ డెలివరీ కోసం రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తున్నారని..  నెలకు ఏకంగా 60 నుంచి 80 మీటర్ల ఇంధనం వాడతారు అంటూ తెలిపింది.



 ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలు పెరగడంతో కేవలం పెట్రోల్ కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అందుకే ఈ విషయంపై ఆలోచించి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని వారి రెమ్యూనరేషన్ పెంచాము అంటూ చెప్పుకొచ్చారు జొమాటో వ్యవస్థాపకుడు. అంతేకాకుండా లాండ్ డిస్టెన్స్ ఆర్డర్ పూర్తి చేసిన డెలివరీ పార్టనర్‌కు మరో 15 నిమిషాల్లో మరో ఆర్డర్ వచ్చేలా చూస్తామని జొమాటో హామీ ఇచ్చింది. ఈ ఆర్డర్ ద్వారా తాము పని చేసే బేస్ ఏరియాకు చేరుకోవడంతోపాటు.. అదనపు దూరం ప్రయాణించినందుకు ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది. జొమాటో ఇటీవలే రూ.1800 కోట్లకుపై నిధులను టైగర్ గ్లోబల్, కోరా.. తదితరుల నుంచి సేకరించింది. ఈ సంస్థకు లక్షన్నర మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: