ఏపీలో పంచాయతీ ఎన్నికలు  మొదలైనప్పటి నుండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు అధికార పార్టీ కి మధ్య చెలరేగిన  పోరు ఈ రోజుకీ అదే రేంజులో కొనసాగుతూ ఉంది. పల్లె పోరు ముగియ గానే నగర స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గడిచిన పల్లె పోరులో ప్రభుత్వం తరపున వాలంటీర్లు ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీని వలన ప్రతి పక్ష టీడీపీ కొన్ని పంచాయతీలలో ఓటమి చెందామని అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనీసం జరగబోయే నగర స్థానిక ఎన్నికలలో అయినా వాలంటీర్ల పాత్రను నిషేధించాలి అని ధ్వజమెత్తింది. ఇటు ఎస్ ఈ సి సైతం ఈ సారి మునిసిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల జోరుకు కళ్లెం వేస్తున్నట్లు తెలిపింది. నగర స్థానిక ఎన్నికల్లో వాలంటీర్లు వినియోగం ఉండబోదని తేల్చేసింది.

ఇప్పటికే పలు పిటిషన్లు విచారించిన న్యాయస్థానం కూడా మునిసిపల్ ఎన్నికల్లో జ్యోకం చేసుకోబోమని తెలిపింది.  పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల వైఖరిపై పలు అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ...ఈసారి అటువంటి అనుమానాలకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని..అదేవిధంగా ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన పెట్టారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు నిమ్మగడ్డ.

కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రచారాల్లో ఎక్కడా ఈ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపించలేదు. ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు. అలాగే నిభందనలు ప్రకారం అన్ని జరగక పోతున్నపటికి...ఇప్పటివరకు ఎవరిపైనా యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు. ప్రచారాల్లో అటు అధికార పార్టీ ఇటు ప్రత్యర్థి పార్టీలు తమ దూకుడు చూపుతున్నాయి. మరి ఫలితాలు ఎవరికి ఆధిక్యతను తెచ్చిపెట్టనున్నాయో  తెలియాల్సి ఉంది. అయితే వాలంటీర్లను నిలువరించడంలో ఎంతమేరకు ఎస్ ఈ సి సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: