ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో చరిష్మా  కలిగిన పార్టీ గా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబునాయుడు చేతిలోకి వచ్చింది పార్టీ. అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలోనుంచి పార్టీ పగ్గాలు చేపట్ట పోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా చంద్రబాబు నాయుడు...  తనదైన వ్యూహలతో  ముందుకు సాగి పార్టీని ఎంతో విజయవంతంగా నడిపించారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు రేంజ్ లో మళ్ళీపార్టీని ఎవరు నడిపించ బోతున్నారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.



 ఈ క్రమంలోనే లోకేష్ చంద్రబాబు తర్వాత ఎవరు పార్టీ పగ్గాలు చేపడతారా అని ప్రచారం జరిగినప్పటికీ అటు లోకేష్ కి పార్టీ పగ్గాలు చేపట్టడంపై మాత్రం తెలుగు తమ్ముళ్లు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ  క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం ఉండదని తాత చరిష్మా  ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే..  ఇక మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం కూడా గత ఎన్నికలలో ఓటమి తర్వాత ఎంతగానో జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి... టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటూన్నారు.



 జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో  రాజకీయాల్లోకి రావడం టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టడం తెలుగు తమ్ముళ్ల కోరిక తీరడం మాత్రం జరగడం అసాధ్యం అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముమ్మర ప్రచారం చేపట్టిన జూనియర్ ఎన్టీఆర్ ను ఆ తరువాత సముచిత గౌరవం ఇవ్వకుండా పార్టీ పక్కన పెట్టడం... ఆ తరువాత హరికృష్ణ రాజ్యసభకు రాజీనామా చేసిన సమయంలో మళ్ళీ ఎంపిక  చేయకపోవడం ఇలా పలు రకాల కారణాల వల్ల ఇక ఎన్టీఆర్ కూడా రాజకీయాలపై ఆసక్తి కోల్పోయారని.. అదే సమయంలో ప్రస్తుతం సినిమాల్లో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉండడంతో ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదు అని అంచనా వేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: