ప్రస్తుతం ఎక్కడ చూసినా యూట్యూబ్ యుగం నడుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది యూట్యూబ్ లో లక్ష రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.  ఇంకొంతమంది  ఎలాంటి సమాచారం కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ యూట్యూబ్ అనేది కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతోమంది యూట్యూబ్ లో ఫేమస్ కావాలి అనే ఉద్దేశంతోఎంతో కొత్తగా చెత్తగా ప్రయత్నాలు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు  కూడా ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఓ ఉపాధ్యాయుడు ఇలాంటిదే చేశాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినది  పోయి...  పాడు ఆలోచన చేసాడు.  ఒక భయానక ఆలోచన చేసి రాత్రికి రాత్రి ఏకంగా యూట్యూబ్ లో సెలబ్రెటీ కావాలని అనుకున్నాడు.  దీని కోసం ఏకంగా తన మగతనాన్ని పెట్టుబడిగా పెట్టి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యువేట్ ఆండ్రు బ్రిడ్జ్ అనే వ్యక్తి బ్రిటన్లో టీచర్ గా పని చేస్తున్నాడు.  అయితే ఇటీవలే అతడికి యూట్యూబ్ లో వీడియోలు ద్వారా చేతినిండా డబ్బులు సంపాదించాలని ఐడియా వచ్చింది.



 ఈ క్రమంలోనే తన రూమ్మేట్ కి ఒక ఛాలెంజ్ చేశాడు. తన ప్రైవేట్ పార్ట్ కోసి మగతనం  లేకుండా చేస్తే ఏకంగా ఊహించని విధంగా డబ్బులు ఇస్తాను అంటూ ఆశ చూపాడు.  ఇక తన ప్రైవేట్ పార్ట్  కోసిన  వీడియో మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఒప్పందం చేసుకున్నాడు.  ఇక ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో పదునైన కత్తి అందుకుని ఉపాధ్యాయుడిని  పురుషాంగాన్ని కోసేశాడు రూమ్మేట్.  ఇక ఆ తర్వాత అతనికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు.  ఉపాధ్యాయుడు రూమ్మేట్ మాత్రం అడ్డంగా బుక్కై చివరికి జైలు శిక్ష అనుభవించాల్సి పరిస్థితి ఏర్పడింది.  జరిగిన విషయం చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం వినిపించుకోలేదు.  ఇక పోతే ఆ వీడియో అప్లోడ్ చేశారా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: