భారత దేశ చరిత్రలో మొఘల్ చక్రవర్తలు రాజ్యపాలన చేసే సమయంలో భారత దేశం గొప్ప సంపదతో ఉండేది. ముఖ్యంగా షాజాహాన్ పాలనా సమయంలో భారత దేశం సుభిక్షంగా ఉండేదట. 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలం. ఆయన కాలంలో అనేకమైన గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించారు. అందులో ముఖ్యమైనది తాజ్ మహల్. ఇది ప్రేమకు చిహ్నంగా షాజాహాన్ తన భార్య కోసం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది.
షాజాహాన్, ముంతాజ్ మహల్ చిత్రం
షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి పధ్నాలుగో సంతానం గౌహరా బేగంకు జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండి పోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్‌ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరిక సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తరువాత 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. తాజ్ మహల్ పర్షియా నిర్మాణశాస్త్రం మరియు తొలినాటి మొఘల్ నిర్మాణశాస్త్రాల యొక్క రూప కల్పనా సంప్రదాయాలతో కలసి విస్తరించబడింది.