పాముకు పాలు పోసి పెంచినా అది కాటేయక మానదు.. ఎందుకంటే అది దాని జాతి లక్షణం. పామును ఆడించేవాడు చివరికి ఆపాము కాటుకే బలౌతాడంటారని పెద్దలు అంటుంటారు. ఎంతటివారైనా, ఎంత ఉద్దండులైనా.. టైం బాగోలేకపోతే పామే తాడై భయపెడుతుంది. మరలాంటిది ఏకంగా పామే అయితే. పెద్దల మాటలో నిజం లేకపోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాలిఫోర్నియాకు చెందిన ఓ స్నేక్ క్యాచర్ ఓ భయంకరమైన పైథాన్ బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సరీసృపాల సంరక్షణశాల వ్యవస్థాపకుడు మిస్టర్ బ్రూవర్ పాములు పట్టడంలో దిట్ట. సామాజిక మాధ్యమాల్లో సైతం తన సాహస విన్యాసాలను పోస్ట్ చేస్తుంటారు. ఎంతో ప్రమాదకరమైన పాములతో ఆటలాడుతూ వీడియోలు, ఫోటోలు పెడుతుంటారు. అలాంటి బ్రూవర్‌కు భారీ పైతాన్ నుంచి అనుకోని సంఘటన ఎదురైంది.
పాము గురించి వివరిస్తుండగా కొన్ని సెకండ్ల పాడు తన చూపును పక్కకు తిప్పాడు. ఆదమరిచి ఉన్న పాము.. శాంతంగా ఉన్నట్లే కనిపించినా.. చూసేందుకు కూడా భయంకరంగా ఉన్న ఓ భారీ పైథాన్ బ్రూవర్‌పై దాడికి యత్నించింది. పైథాన్ గురించి వివరిస్తున్న సమయంలో ఉన్నట్లుంది పాము బ్రూవర్‌పై పైకి దూసుకెళ్ళింది. ఇది గమనించిన బ్రూవర్ తృటిలో వెనక్కు వెళ్ళి తప్పించుకున్నారు. తిరిగి పామును కంట్రోల్ చేయడంతో అది నెమ్మదించింది.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు బ్రూవర్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను ఇప్పటి వరకు దాదాపు 8.9 లక్షల మంది వీక్షకులు చూశారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అదృష్టవంతుడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత రోజులలో సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులు, వన్య ప్రాణులకు సంబంధించిన ఫోటో, వీడియో లు వైరల్ అవుతు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి