సాధారణంగా ప్రతి మనిషి జీవితం లో దగ్గు జలుబు అనేవి వస్తూనే ఉంటాయి . ఏదైనా చల్లటి వస్తువులు తిన్నప్పుడు లేదా తాగినప్పుడు ఇక ఇలా జలుబు దగ్గు లాంటి రావడం చూస్తుంటామ్.  అయితే ఒకప్పుడు అయితే ఇలా జలుబు దగ్గు రావడం సర్వసాధారణం అని అనుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం జలుబు దగ్గు అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది . దీనికి కారణం కరోనా వైరస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు .  కరోనా వైరస్ లక్షణాలలో దగ్గు జలుబు లాంటివి కూడా ఒకటి కావడంతో ప్రస్తుతం ఎవరికైనా దగ్గు వచ్చినప్పుడు కూడా దగ్గడానికి ఇబ్బంది పడుతున్నారు .ఒకప్పుడు ఎవరికైనా దగ్గు గాని తుమ్ము వచ్చినప్పుడు ఆపకుండా దగ్గటానికి చూసేవారు కానీ నేటి రోజుల్లో మాత్రం దగ్గాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది .దేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. అయినా  మహమ్మారి వైరస్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.



 అయితే దగ్గు అనేది ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ నేటి రోజుల్లో మాత్రం దగ్గితే మాత్రం కరోనా వైరస్ అని భావిస్తున్నారు ఈ క్రమంలోనే పదిమందిలో స్వేచ్ఛగా తిరగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది నేటి రోజులు అయితే సాధారణంగా వివిధ రకాల సమస్యల కారణంగా దగ్గడం లాంటివి చేస్తూ ఉంటారు  ముఖ్యంగా పొడి దగ్గు అనేది చాలామందిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అంతే కాకుండా గొంతులో కఫం చేరుకోవడం వల్ల కూడా తరచూ దగ్గు రావడం లాంటి సమస్యలు వస్తూ ఉంటారు.  అయితే ఈ దగ్గు సమస్యలకు చెక్ పెట్టడానికి ఎంతో మంది వివిధ రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు.



 అయితే మెడిసిన్స్ వాడటం కాదు వంటింటి చిట్కాలు పడితే ఇక ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు అని చెబుతున్నారు నిపుణులు  ముఖ్యంగా తులసి ఆకులు తింటే దగ్గు మాయం అవుతుంది భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నాకూడా దగ్గు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా దగ్గు నుంచి ఉపశమనం పొందాలి అంటే తేనెలో నల్ల మిరియాలను కలుపుకొని తాగడం వల్ల కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది అంటున్నారు. వెల్లుల్లి తిన్నా కూడా దగ్గు కి పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: