విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో శానిటేషన్ నిర్లక్ష్యంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సహించేది లేదని మంత్రి ఆళ్ల నాని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని... కరోనా వార్డ్ లో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో హాస్పిటల్స్ లో శానిటేషన్ లోపిస్తే సంబందించిన కాంట్రాక్టర్లపై చర్యలకు వెనుకాడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తక్షణమే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా వార్డ్ లో శానిటేషన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్ ను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. కరోనా బాధితులకు ఆహారం, శానిటేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో శానిటేషన్ పై ప్రత్యేకంగా దృష్టి  పెట్టాలని వైద్య ఆరోగ్య అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరిస్తామని అవసరం అయితే కాంట్రాక్టు రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతుంది. ఇప్పటికే నాలుగు జిల్లాలకు సంబంధించి సిఎం వైఎస్ జగన్ అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. లాక్ డౌన్ పై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: