తెలంగాణాలో కరోనా పరిస్థితికి సంబంధించి నేడు హైకోర్ట్ లో అత్యవసర విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుని హైకోర్ట్ అడుగడుగునా తప్పుబట్టింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీరు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని లాక్ డౌన్ నిర్ణయాన్ని ఆక్షేపించింది. అదే విధంగా సడెన్ గా రేపటి నుండి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైం లో ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అదే విధంగా పోయిన ఏడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని పిటిషనర్లు కోరారు.

దీనికి స్పందించిన హైకోర్ట్ రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఎం చేస్తోందని  నిలదీసింది. 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఇతర ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ఫలితాలిస్తుందని విచారణ సందర్భంగా హైకోర్ట్ పేర్కొంది. లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైన రిలాక్సేషన్ ఉందా అంటూ ప్రశ్నించగా ఎలాంటి రిలాక్సేషన్  లేదని అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇక లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై పూర్తి వివరాలు కోసం మూడు రోజుల సమయం అడ్వకేట్ జనరల్ అడిగారు.

దీనిపై హైకోర్ట్ కీలక వ్యాఖ్య చేసింది. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అంటూ ప్రశ్నించింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లుల పై చర్యలు తీసుకోవాలి అని పిటిషనర్ విజ్ఞప్తి చేయగా... ఈ సమయం లో హాస్పిటల్ పై చర్యలు తీసుకోమని మేం ఎలా దేశాలు ఇస్తాం అని నిలదీసింది. ప్రపంచం మొత్తం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్ల పై చర్యల తీసుకోమని మేం ఎలా చెప్తాం అంటూ ఎదురు ప్రశ్నించింది. ఆర్టికల్ 14,19 1(d) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల నుండి అంబులెన్స్ లను నిలిపివేసి ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడినట్టు హైకోర్ట్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: