దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మొదటిరకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం కరోనా వైరస్ రెట్టింపు వేగంతో పాకిపోతోంది. దీంతో దేశ ప్రజానీకం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకు దేశంలో వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ క్షణంలో ప్రాణం పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది.  అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.



 రోజురోజుకు మహమ్మారి వైరస్ అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ప్రజలందరూ ఎంత అవగాహనతో ఉన్నప్పటికీ ఇక భయాందోళనకు మాత్రం గురవుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇక పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని లాక్ డాన్ విధించడం లేదా కఠినమైన కర్ఫ్యూ విధించడం లాంటి ఆంక్షలను అమలులోకి తీసుకు వస్తున్నాయి.  తద్వారా గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుంది అని చెప్పాలి   అంతే కాదు అటు రికవరీ రేటు కూడా పెరుగుతూ ఉండడం అందరిలో ధైర్యాన్ని నింపుతోంది.



 24 గంటల్లో కరోనా వైరస్ కేసులు కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం అనేది శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడు లక్షల 48 వేల 389 కేసులు వెలుగులోకి వస్తే.. రికవరీ అయిన రోగుల సంఖ్య మూడు లక్షల 55 వేల 56 మంది   వైరస్ బారి నుంచి బయటపడ్డారు. కానీ రికవరీలు పెరిగాయని సంతోషపడే లోపే అటు కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది  అంతకు ముందు రోజు 3,800 కు పైగా కరోనా మరణాలు ఉంటే..  గత 24 గంటల్లో 4189 మరణాలు సంభవించాయి.  అలా ఓ వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండటం రికవరీ రేటు  అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం అంత బాగున్నప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతూ ఉండడం మాత్రం అందరిని  ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: