దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రతిభ, అంతర్గత అధ్యయనం ఆధారంగా మార్కుల కేటాయింపు చేపట్టనున్నారు. కాగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ వాయిదా వేసిన 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ మరియు ఇతర పరీక్షల నిర్వహణ గురించి ఉన్నత స్థాయి సమావేశం మే 23న జరగనుంది. ఆ సమావేశంలో వివిధ పరీక్షలపై, ఉన్నత విద్యపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశానికి మంత్రులు, పలు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి