చైనా వ్యవహారం రోజురోజుకు హాట్ టాపిక్ గా మారిపోతుంది.  ఓవైపు ప్రపంచ దేశాలకు చెందిన నిపుణులు అందరూ ఒక బృందంగా ఏర్పడి కరోనా వైరస్ కి సంబంధించిన నిజాలను  ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో ఇక ప్రపంచ దేశాల ముందు చైనా క్రమక్రమంగా దోషిగా మారిపోతుంది.  ఇలాంటి సమయంలో ఇక దృష్టి మరల్చేందుకు చైనా ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో లాగానే భారత్-చైనా సరిహద్దు లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విధంగా భారీగా ఆయుధాలు మొహరింపు జరుపుతుంది చైనా.



 దీంతో భారత్ చైనా సరిహద్దు లో మరోసారి యుద్దవాతావరణం నెలకొంది.  అయితే ఇప్పటికే తూర్పు లడక్ ప్రాంతంలోని భారత్-చైనా సరిహద్దు లో గత కొన్ని రోజుల నుంచి యుద్ధ విన్యాసాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది చైనా.  అయితే మొన్నటి వరకు కేవలం ఆయుధాలను మాత్రమే మోహరింపు జరపగా.. ఇప్పుడు ఏకంగా యుద్ధ విమానాలను సైతం మొహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఇటీవలే చైనాకు చెందిన నూతన టెక్నాలజీతో కూడిన బాంబర్లని భారత్-చైనా సరిహద్దు సరిహద్దుల్లో మోహరించింది చైనా.



 లడక్ కి అత్యంత సమీపంలో ఉండేటువంటి విమానాశ్రయానికి బాంబర్ లను తెచ్చిపెట్టింది చైనా.  భారత్ దగ్గర ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను లడక్ దగ్గర వినియోగిస్తున్న నేపథ్యంలో ఇక వ్యూహాత్మకమైన ఆధిపత్యం కోసం షియాన్ హెచ్ 20 ఫైటర్ జెట్లను ప్రస్తుతం చైనా మోహరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ ఫైటర్ జట్లతో ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు కూడా చేస్తూ రెచ్చగొడుతుంది చైనా. జూన్ 22వ తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున ఇక జూన్ 22వ తేదీ వరకు భారత్-చైనా సరిహద్దు లో ఇలాంటి తరహా యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు తెలుస్తోంది.  దీంతో చైనా తీరు కాస్త యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: