ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం టిపిసిసి పదవీ బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారో లేదో ఆయనపై ఇటీవలే రెండు కేసులు నమోదయ్యాయి. టిపిసిసి పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్ రెడ్డి. అనంతరం దర్గాలో ప్రార్థనలు కూడా చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ర్యాలీ లో భారీగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇలా ర్యాలీగా గాంధీ భవన్ కు చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇలా ఎలాంటి అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడం పై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇలా జూబ్లీహిల్స్ లొ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కూడా ఒక కేసు నమోదు అయ్యింది ఇక మరోవైపు బేగం బజార్ లో కూడా రేవంత్ రెడ్డి పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు అయితే రేవంత్ రెడ్డి ఇలా టిపిసిసి పదవిలో ఎన్నికైన కొన్ని రోజుల్లోనే రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేయడంపై మాత్రం అటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టిపిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అటు రేవంత్ రెడ్డి ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి