‘ఇప్పటికే చాలా దేశాలు కరోనా థర్డ్ వేవ్ తో అల్లాడి పోతున్నాయి. దక్షిణ, ఉత్తర అమెరికాలు తప్ప దాదాపుగా మిగిలిన అన్ని ప్రదేశాల్లోనూ కరోనా విజృంభిస్తూ పెను ప్రమాదంగా మారుతోందని తెలిపింది. కావున దీన్ని హెచ్చరికగా భావించి ఇకపై అత్యంత జాగ్రత్త వహించాలని, కరోనా మూడవ దశను మొదట్లోనే అరికట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య సంస్థ ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ థర్డ్ వేవ్ ను అడ్డుకోవడం అసాధ్యమైన విషయం ఏమీ కాదు. మన చేతిలో ఉన్నదే. మూడవ దశ ఆరంభంలోనే ప్రజలు అప్రమత్తమైతే థర్డ్ వేవ్ ను కట్టడి చేయడం సాధ్యమేనన్నారు. నెదర్లాండ్, స్పెయిన్ , బంగ్లాదేశ్, ఆఫ్రికా మయన్మార్, మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల్లో ఇప్పటికే కరోనా మూడో దశ తన పంజా విసురుతూ ఉదృతి పెంచిందని వీకే పాల్ పేర్కొన్నారు. ఇక మన దేశం విషయానికి వస్తే కరోనా నీలి చాయలు దేశాన్ని ఇంకా వీడలేదు. వైరస్ ని తట్టుకోగల హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా మనలో పెంపొందలేదు. కనీసం 50 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి