రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుందని తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ల పై ట్యాక్స్ పంచుకుంటూ పోతున్నాయి. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఇలా ఇంధన ధరలు అమాంతం పెరగడానికి ఎన్నో కారణాలను కేంద్రం చెబుతూ వస్తోంది. ఈ పెట్రోల్ మరియు డీజిల్ లను ట్యాంకర్లలో తీసుకువస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది-బరోటివాలా-నాలాగర్ పారిశ్రామిక హబ్ నుండి దాదాపు 13000 ట్రక్ లకు సంబంధించిన వారు అంతా కలిసి ఒక యూనియన్ గా ఏర్పడ్డారు. ఇది ఆసియాలోనే అత్యంత పెద్ద లారీ యూనియన్ గా పేరొందింది. వీరంతా కలిసి గత సంవత్సరం జులై నెలలో సమావేశం అయ్యి, డీజిల్ ధరలు పెరగడంతో ట్రక్ ల ఫ్రైట్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజకీయ ప్రయోజనాలా నేపథ్యంలో వీరి డిమాండ్ ను పరిశ్రమలు అంగీకరించాయి. అంతే కాకుండా కరోనా వైరస్ ప్రభంజనం మరియు ఇంధన ధరలు పెరగడం ఈ రెండు కారణాల వలన భారతదేశ ఆర్ధిక వ్యవస్థ చాలా కృంగిపోయిందని చెప్పాలి. 
దీని ద్వారా అక్కడ ట్రక్ యజమానులకు పరిస్థితికి మించిన ఆర్ధిక భారం పడడంతో ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారట. ఒక్కసారిగా వ్యాపారం అంత పడిపోవడంతో లోన్ లు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బంది పడ్డారని అప్పుడు వీరు తెలియచేశారు. ఇది ఎప్పటికీ రికార్డుగా నిలిచించి. మనకు స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలలో 2020-2021 ఆర్ధిక సంవత్సరం దారుణమైనదిగా వర్ణిస్తారు. మరియు ఆర్ధిక వ్యవస్థ 7.3% కు పడిపోయింది. అప్పట్లో ఒక ట్రాన్స్పోర్ట్ యజమాని ఒక పత్రికతో ఈ విధంగా చెప్పారు, ప్రభుత్వం ఎందుకిలా నందన ధరలను పెంచుతుందో అర్ధం కావడం లేదు. మాకు ఆర్డర్లు లేవు, అరకొర ఆర్డర్లు వచ్చిన ఢీల్లీ నుడ్ని అహ్మదాబాద్ కు లేదా ముంబై కి పంపించినా అక్కడ అన్నీ మూసివేయడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాము. ఇలా మాకు వచ్చిన కొంత డబ్బు కూడా డీజిల్ కోసమే ఖర్చు అయిపోతూ ఉంది అని తన గోడును విన్నవించుకున్నారు.
మొదటి దశ కరోనా వలన తీవ్ర నష్టం జరిగినా ప్రభుత్వం కరోనాను నివారించడంలో విఫలమయ్యింది. కాగా సెకండ్ వేవ్ సమయంలోనూ ప్రభుత్వ ఇంధన ధరలను పెంచుకుంటూ పోయింది. జనవరి నెల నుండి ఇప్పటి వరకు చూస్తే 20% సతము పెరుగుదల ఉంది. కరోనా కారణంగా ఒక్క రంగం ఏమిటి అన్ని రంగాలు పతనమయ్యాయి. సామాన్య ప్రజల నుండి పారిశ్రామిక వేత్తల వరకు అందరూ ఇబ్బంది పడ్డారు. పైగా ప్రతి ఒక్కరికీ  ఎంతో అవసరమైన ఇంధన ధరలను పెంచడంతో అదో పెను భారంగా మారింది. పైగా ఎప్పటి లాగే ఇప్పుడు ఇంధన ధరలను పెంచడానికి కారణమా గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక పరమైన పొరపాట్లేనని సర్ది చెప్పుకుంటున్నారు.  గడిచిన కొన్ని నెలలుగా పెరుగుతున్న ఇంధన ధరలు భారతదేశ ద్రవ్యోల్భణం పెరుగుదలపై ప్రభావం చూపించాయని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తెలిపింది. కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ను కొనుగోలు చేయాలంటే, వారి యొక్క నిత్యావసరాల ధరలను తగ్గించుకుంటేనే వీలవుతుందని తెలుపుతున్నారు. ఘంటాపధంగా ఎన్నో కంపెనీలు రాజకీయ పార్టీలు ఇంధన ధరలను తాగించామని చెబుతున్న ఇవేమా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

  దేశంలోని చమురు ఉత్పత్తి కంపెనీలు ఈ ధరలను నిర్ణయిస్తామని తెలుస్తోంది. వీరు కూడ అంతర్జాతీయంగా ఉన్న ముడి చమురు ధరలను బట్టి ధరను నిర్ణయిస్తారు.  ఈ విషయాన్నీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం కారణంగానే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని కేంద్ర పెట్రోలియం మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన తెలిపారు.  కానీ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఆర్ధిక శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. వీరు చెబుతుందంతా వాస్తవం. దేశంలో కేంద్ర అమరియు రాష్ట్ర ప్రభూత్వాలే అని తెగేసి చెప్పారు. కానీ ముడి చమురు ధరలలో కొంతమేర హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా ఇంధన ధరలలో మార్పు లేదు. అంతకు మించే ధరలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఒక పత్రిక తెలిపిన ప్రకారం గత సంవత్సరం ముడి చమురు ధరలు తగ్గడం కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.
మోదీ ప్రధానిగా అయినప్పుడు ముడి చమురు ధరలు 110 డాలర్లు గా ఉంది. కానీ ఆరు నెలల తర్వాత ఆ ధరలు సగానికి తగ్గాయి. కానీ డీజిల్ పెట్రోల్ ధరలలో మార్పు రాలేదు. ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుహ్వలకు పెట్రోల్ డీజిల్ పై విధించే పన్నుల రూపంలో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంధన ధరలలో ఎంత అన్యాయమంటే మనము చెల్లించే లీటర్ ధరలో సగం డబ్బులు పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి వెళుతున్నాయి. ఇలా దేశంలోని ప్రజలకు పెద్ద గుదిబండగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయ్యాయని చెప్పాలి. ఇకనైనా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తే బాగుంటుందని కోట్లాదిమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న ఎన్నికలంను దృష్టిలో పెట్టుకుని పెట్రో ధరల్లో పమార్పులు చేస్తారా ? లేదా ప్రజగ్రహానికి గురయ్యి అధికారాన్ని కోల్పోతారా అన్నది తెలియాలంటే ఇంకో రెండేళ్ల వరకు ఆగాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: